Posts

Showing posts from September, 2021

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

Image
సుఖ దుఃఖాలు  సముద్ర ప్రవాహానికి ఆటు పోటులు ఎలా సహజమో,   అదే విధంగా మానవ జీవితం లో సుఖ - దుఃఖాలు,  మంచి - చెడ్డలు, ఉత్సాహ - నిరుత్సహాలు సహజము. ఆనందం - విచారం వంటి మనోవికాసాలకి లొంగిపోతే అవి మనల్ని కృంగతీస్తాయి. 

శాశ్వతమైనది || Purnodayam || Telugu Quotes

Image
శాశ్వతమైనది  అందమైన శరీరమును చూసి మురిసిపోకు, ఎందుకంటే అందము శాశ్వతం కాదు. దాని విలువ కేవలం పిడికెడు బూడిద మాత్రమే. అందమైమ గుణం, మంచి మనస్సు  మాత్రమే శాశ్వతమైనది. 

నగుమోము # purnodayam blogspot # telugu quotes

Image
నగుమోము  నవ్వుతూ మాట్లాడితే  శత్రువైన స్నేహితుడిగా మారుతాడు. మొఖంలోని చిరునవ్వు , మాటల్లోని మాధుర్యం ఇతరులను ఆహ్లాదానికి గురిచేస్తాయి.  నవ్వు అంత ఆకర్షణీయమైంది.

కావడి కుండలు purnodayam blog , telugu quotes

Image
                             కావడి కుండలు  దుఃఖము వెనుక సుఖము, సుఖము వెనుక దుఃఖము  పగలు రాత్రి మాదిరిగా వస్తుంటాయి పోతుంటాయి. కష్టమైన సుఖమైనా కలకలం కాపురం చేయవు.   కష్ట సుఖాలు కావడి కుండలు.

gelupu otamulu telugu quotes purnodayam blog

Image
                     గెలుపు ఓటములు  మనిషి  జీవితంలో  గెలుపు ఓటములు సర్వసహజం . ఎల్లకాలం ఒకేలా జరిగితె అది కాలం కాదు,  ఒకేలా జరిగితే అది జీవితం కాదు . ఎంతటి వారికైనా ఎదురుదెబ్బలు తప్పవని దెబ్బ   తగిలితేనే జీవితం సాగుతుందని చెప్పడానికి గుర్తులని  మనిషి గ్రహించాలి ..

సోమరి శ్రమజీవి telugu quotes # purnodayam

Image
సోమరి శ్రమజీవి  సోమరి తన సమయానేకాక ఇతరులకాలాన్ని  కూడా వ్యర్థం చేస్తుంటాడు . శ్రమజీవి తనకు, తన కుటుంబానికే కాక మొత్తం సమాజానికే ప్రయోజనం చేకూరుస్తాడు.

జ్ఞాన సంపన్నులు # purnodayam # telugu quotes

Image
జ్ఞాన సంపన్నులు  జీవితము అశాశ్వతమైనదని , గుర్తించిన మోహావేశాలకు , ఆకర్షితులయ్యేవారు సామాన్యులు . వీరు ఎల్లప్పుడూ కోరుకునేవి శారీరక సుఖసౌఖ్యాలు , పంచభక్ష పరమాన్నాలు , డాంభికాని ప్రదర్శించేందుకు సిరిసంపదలు. ఈ లోకంలో తమ  జీవితకాలము కొద్దిరోజులే అని గ్రహించి సర్వాంతర్యామి కరుణాకటాక్షాలు కోసం పరితపించేవారు జ్ఞాన సంపన్నులు