సంక్రాంతి పండుగ

 

                                                  సంక్రాంతి పండుగ 

                                    

పూజా విధానం 

సంక్రాంతి అంటే పంటల సంవత్సరాది. అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇళ్లకు చేరే తరుణం ఇది. తిధి ప్రధానమైన పండుగ కాదుఇది . కనుక సర్వ సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 14  లేదా 15 తేదీలలో వస్తుంది. రైతులు అందరికి పంటలు చేతికి వచ్చే కాలమిది. ధాన్యలక్ష్మి రూపంలో రైతు ఇంటికి లక్ష్మి దేవి చేరుతుంది.  ధాన్యలక్ష్మి ఆహ్వానిస్తూ జరుపుకునే సంబరాల పండుగే సంక్రాంతి

ఇది మూడు రోజుల పండుగ.

మొదటి రోజు భోగి 

రెండవ రోజు మకర సంక్రాంతి 

మూడవ రోజు కనుమ 

సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే ఆడపిల్లలు రంగు రంగుల ముగ్గులు ఇంటి ముందు అలంకరిస్తారు .

ముగ్గుల మధ్య ఆవు పేడతో చేసిన బొబ్బమలను పెడతారు. వీటిపై గుమ్మడి , బంతి పువ్వులు పెట్టి  అలంకరిస్తారు.

వీటి చుట్టూ  కన్నె పిల్లలు వలయ ఆకారంలో తిరుగుతూ గొబ్బి పాటలు పాడుతారు, అబ్బాయిలు  గాలిపటాలు ఎగురవేస్తారు .

మకర సంక్రమణానికి ముందు రోజు భోగి పండుగ

భోగి పండుగరోజు భోగి మంట ప్రత్యేకం. తెల్లవారక ముందే మంచు తెరల మధ్య భోగి మంటల కోలాహలం మొదలవుతుంది. భోగి పండుగ రోజున సూర్యోదయనికి ముందే అభ్యంగన స్నానం చేస్తారు. కొత్త బియ్యంతో పులగం చేసి సూర్యభగవానునికి నివేదిస్తారు. ఈరోజున, సాయంత్రం వేళ 5 సంవత్సరాలలోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. వీటిలో చిల్లర డబ్బులు , రేగి పళ్ళు , గుళ్ళ శనగపప్పు దిష్టి తీసి వారి శిరసుపై నుంచి కిందకు జారేలా పోస్తారు. ముతైదువులకు తాంబూలాలు ఇస్తారు

రెండవ రోజు మకర సంక్రాంతి . సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె ఒంటికి రాసుకొని స్నానం చేస్తారుఈరోజు ప్రధాన గుమం వద్ద ఝాజుతో అలికి ముగ్గు పెట్టి, మూడు ఇటుకరాలు పెట్టి వాటి మధ్యలో పిడికలు పెట్టి నిప్పుఅంటించి , వాటి మీద కొత్త కుండా పెట్టి పాలు పొంగిస్తారు.

మకర సంక్రాంతి రోజున తెలంగాణ వైశ్యులు నోములు నోచుకుంటారు.

5 మట్టి కుండలు , పసుపు, కుంకుమ , గాజులు, నిమ్మపండ్లు , వెలగపండ్లు ఇలా పలు రకాల నోములు, అంతేకాక ఏవైనా 13  వస్తువులు అనగా స్టీలు కానీ, ప్లాస్టిక్ కానీ ఇలా ఏదైనా వస్తువులు పెట్టి పసుపుతో గౌరీ దేవిని చేసి వస్తువుల పైన మరియు  పండ్ల మీద పెట్టి పూజించి నోము నోచుకుంటారు. తరువాత వస్తువులు, పండ్లు ఇలా నోచుకున్న వాటిని ముతైదువులకు వాయినాలుగా ఇస్తారు

 

ఇక సంక్రాంతికి మూడవరోజు కనుమఇది పశువులకు చేసే పండుగ.  

 

పాడిపరిశ్రమకు ఆధారమైన గోమాతలను పసుపు కుంకుమలతో పూజిస్తారు.అలాగే వ్యవసాయానికి ఉపయోగించిన పరికరాలను కూడా పసుపు, కుంకుమలతో పూజిస్తారుపొంగళ్ళు చేసి పొలంలో  చల్లుతారు. కొన్ని చోట్ల ఎద్దులను ఊరేగిస్తారుమరికొన్ని చోట్ల కోడి పందాలు నిర్వహిస్తారుమన తెలంగాణ వైశ్యులు కొంతమంది కనుమ రోజున కనుమ గౌరీ నోము నోచుకుంటారు.అనగావడి బియ్యం వాటి మీద 5 నల్ల పూసల దండలుపెట్టి, వాటి మీద పసుపుతో గౌరీ దేవిని చేసి పెట్టి కనుమ గౌరీ నోము నోచుకుంటారు. తరువాత 5 ముతైదువులకు నల్ల పూసల దండలు కట్టి వడి బియ్యం , పండ్లు, నానబెట్టిన శనగలు తాంబూలము ఇస్తారు.

Comments

Post a Comment

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure