కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

కుంకుమ గౌరీ నోము కథ 



ఒక బ్రాహ్మణునకు లేకలేక ఒక కూతురు కలిగెను.అతడు ఆమె జాతకము చూడగా , అందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్లి పార్వతి దేవిని ప్రార్ధించెను. అంతటా దయామయియగు పార్వతీదేవి ప్రత్యక్షమై, మీకేమి కావలెను ? అని అడుగగా, అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండు అట్లు చేయమని ప్రార్ధించెను. అప్పుడు పార్వతీదేవి, ఓయి బ్రాహ్మణోత్తమా !
నీ కుమార్తె పూర్వ జన్మమున కుంకుమ గౌరీ నోము నోచి ఉల్లంగించుటచే ఈ జన్మలో బాల వైధవ్యం ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము చేయించునచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా , అమ్మకు భక్తితో నమస్కరించి కూతురితో ఆ నోము చేయించి తరువాత ఆమెకు వివాహం చేసెను.  ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉన్నది. 
ఈ నోము ఒక సంవత్సరం పాటు కార్తీకం లేదా మాఘమాసంలో మొదలుపెట్టి రోజు ఉదయం దీపారాధన చేయగానే , అక్షింతలు చేత పట్టుకొని ఈ  కథ చదువుకొని , కథ చదువుకోవడం పూర్తి కాగానే కొన్ని అక్షింతలను గౌరీ దేవి పటమునకు వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకునే వారి తలపై వేసుకోవలెను. ఇలా సంవత్సరంపాటు చేసిన తరువాత ఉద్యాపన చేసుకోవాలి. 
ఉద్యాపన : 13 కుంకుమభరిణెలు నిండా కుంకుమ పోసి నల్లపూసలు దక్షిణతాంబులం పెట్టి 13  ముత్తయిదులకు తాంబూలం ఇవ్వాలి. 

Kumkuma gowri nomu katha

Comments

Popular posts from this blog

జ్ఞాన సంపన్నులు # purnodayam # telugu quotes

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

జంధ్యాల పూర్ణిమ jandyala purnima | sravana purnima

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure

లక్ష్మికళ || purnodayam blogspot || telugu quotes

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

అనుభవాలు, purnodayam blogspot

ఏది శాశ్వతం