దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure


దంపతి తాంబూల నోము కథ .

ఒక రాజు భార్య దంపతుల తాంబూలము నోము పట్టి నియమం తప్పింది. అందువలన ఆ భార్య భర్తలు దూరం అయ్యారు , సంపదలు తగ్గాయి . అందువలన ఆమె అరణ్యమునకు వెళ్లి అచట పార్వతి పరమేశ్వరుల గూర్చి తపస్సు చేయగా , పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి , నీవు దంపతుల తాంబూల నోము పట్టి నియమం తప్పినావు  , అందువలన నీకు ఈ బాధ కలిగింది. కావున నీవు ఇంటికి వెళ్లి నియమం తప్పకుండ ఈ వ్రతం చేసుకొని ఉద్యాపన చేసుకొనిన ఎడల నీ పూర్వపు భాగ్యాలు నీకు కలుగుతాయి. నీ భర్త నీకు దగ్గర అవుతాడు అని చెప్పారు. అప్పుడు రాజు భార్య ఇంటికి వచ్చి, భక్తి శ్రద్దలతో నోము చేసుకొని ఉద్యాపన చేసినది. అప్పుడు ఆమె భర్త తిరిగి వచ్చాడు. పూర్వపు భాగ్యాలు తిరిగి వచ్చాయి. భార్య భర్తలు 
 ఆనందంగా ఉన్నారు ఉద్యాపన : ఒక సంవత్సరము పాటు , రోజు ఉదయం మన పూజ గదిలో దీపం పెట్టగానే అక్షింతలు చేతపట్టుకొని. పైన రాసిన కథ చదువుకొని, తరువాత అక్షింతలను కొన్ని పార్వతి పరమేశ్వరుల పటమును వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకొనే స్త్రీ తలపై చల్లుకొనాలి. ఇలా సంవత్సరం తరువాత బ్రాహ్మణా దంపతులకు భోజనం పెట్టి, 360 తమలపాకులు, 360 పోకచెక్కలు , ఇద్దరికి వస్త్రములు, పళ్ళెములో పెట్టి ఇవ్వవలెను. గమనిక : ఏ వ్రతం అయినను సంవత్సరం అనగా కార్తీకం లేదా మాఘమాసం మొదలు పెట్టి, ఒక సంవత్సరం చేసుకోవాలి.


Comments

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

సంక్రాంతి పండుగ

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja