కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja
కుంకుమ గౌరీ నోము కథ ఒక బ్రాహ్మణునకు లేకలేక ఒక కూతురు కలిగెను.అతడు ఆమె జాతకము చూడగా , అందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్లి పార్వతి దేవిని ప్రార్ధించెను. అంతటా దయామయియగు పార్వతీదేవి ప్రత్యక్షమై, మీకేమి కావలెను ? అని అడుగగా, అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండు అట్లు చేయమని ప్రార్ధించెను. అప్పుడు పార్వతీదేవి, ఓయి బ్రాహ్మణోత్తమా ! నీ కుమార్తె పూర్వ జన్మమున కుంకుమ గౌరీ నోము నోచి ఉల్లంగించుటచే ఈ జన్మలో బాల వైధవ్యం ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము చేయించునచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా , అమ్మకు భక్తితో నమస్కరించి కూతురితో ఆ నోము చేయించి తరువాత ఆమెకు వివాహం చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉన్నది. ఈ నోము ఒక సంవత్సరం పాటు కార్తీకం లేదా మాఘమాసంలో మొదలుపెట్టి రోజు ఉదయం దీపారాధన చేయగానే , అక్షింతలు చేత పట్టుకొని ఈ కథ చదువుకొని , కథ చదువుకోవడం పూర్తి కాగానే కొన్ని అక్షింతలను గౌరీ దేవి పటమునకు వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకునే వారి తలపై వేసుకోవలెను. ఇలా సంవత్సరం...
Comments
Post a Comment