గోధుమ రవ్వ రాగి సంగటి

 

                   గోధుమ రవ్వ రాగి సంగటి 

                    ( Godhuma ravva raagi sangati )

               godhuma ravva recipe, ragi recipes

గోధుమ రవ్వ  వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గోధుమల ద్వారా తీసిన రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి.

మధుమేహం పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు. అటువంటి వ్యాధిని తరిమికొట్టే సరైన ఆహరం గోధుమలు  

గోధుమలు మరియు రాగులు కలిపి వండటం  వల్ల ఇది ఆరోగ్యకరమైనది మరియు పోషకాలను  పూర్తిగా అందించగలిగేది.

ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది.

 

రాగుల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి మరియు ఎముకలు బలంగా తయారవుతాయి.

ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయిరాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.

ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చే గోధుమలు మరియు రగులుతో రుచికరంగా తక్కువ పదార్దాలతో చక్కటి బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ సంగటికి ఎలా చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు

గోధుమ రవ్వ(డలియా): 1cup 

రాగి పిండి : 1 /2cup

తయారు చేయు విధానం:

1. ఒక పాన్ లో  కొద్దిగా నూనె వేసి కాగాక అందులో గోధుమ రవ్వను కమ్మటి వాసనా వచ్చేవరకు వేయించుకోవాలి 

2. ఒక ప్రెషర్ కుక్కర్ లో 1cup గోధుమ రవ్వకు 4 cup నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి

3. నీళ్లు మరుగుతునప్పుడు నెయ్యిలోనూనెలో వేయించుకున్న గోధుమ రవ్వ ను వేసి కలుపుకొని మూతపెట్టుకొనివిజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

4. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి

5. స్టీమ్ పోయేలోపు రాగుల పిండి ని ఒక గిన్నెలో వేసుకొనిఉండలకట్టకుండా నీళ్లు పోస్తూ పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి .

6. స్టీమ్ పోయాక కుక్కర్ మూతతీసి మల్లి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలపాలి.

7. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచం కొంచం వేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి

8. పిండి వేసాక స్టవ్ మంట " లో " ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరకు అయ్యేవరకు గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి.

9.  దగ్గరకి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సాంబారుతో కానీ , ఏదైనా కూరతో  కానీ తింటే బాగుంటుంది

 

రెసిపీ కోసం కింద ఉన్న వీడియోను  క్లిక్ చేయండి .

https://youtu.be/WEfbu61YGVk

Comments

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

సంక్రాంతి పండుగ

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure