ఏది శాశ్వతం

చంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటి ఏదిరా 
కళ్ళు మూసి తెరిచే లోపల కలిమిలేములు మారురా 
మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా 
నాది నీది  యనుచు నరుడా వాదులాడబోకురా 
బంక మట్టి ఇల్లురా ఇది భగ్గి భుగ్గి అవునురా 
ఆలుపిల్లలు ఆస్తి పాస్తులు అంతం ఏమవునురా 
తత్వ మర్మము తెలియలేకను తప్పుదారిన బోకురా 
ఆత్మకెప్పుడు చావులేకను అంతటా వెలుగొందురా 
మట్టి మట్టి కలిసినాక ఎట్టిభేదాలుండురా 
---------
సేకరణ : పూర్ణోదయం 
 

Comments

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

సంక్రాంతి పండుగ

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure