Posts

Showing posts from August, 2021

తదియ గౌరీ నోము gowri thadiya vratam during Ganesha festival. Gouri thadiya puja . thadiya nomu. chaviti nomu. 16 kudumula taddi nomu

Image
భాద్రపద మాసంలో వినాయక చవితికి ఒకరోజు ముందుగా వచ్చే శుద్ధ తదియ నాడు తదియ గౌరీ నోము చేసుకుంటారు. ఈ వ్రతం రోజు ముందుగా ముత్తయిదువులు తల స్నానం చేసి, పూజగదిలో ఒక మూలాన పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు పెట్టి దాని మీద ఒక విస్తరి ఆకు పెట్టి విస్తరాకు మీద ఇసుక పోసి దాని మీద ఒక వెండి కానీ రాగి చెంబు కానీ పెట్టి, ఆ చెంబులో బియ్యం పోసి అందులో గన్నేరు కొమ్మ పెట్టి ఆ చెంబుకు ఐదు పోగుల దారం దానికి ఉత్తరేణి లేదా తమలపాకుతో కానీ తోరం కట్టి చెంబుకు గంధంతో కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబు ముందట ఒకటి వెండిది కానీ రాగి కానీ లేక ఇతడి పళ్లెం కానీ పెట్టి ఆ పళ్లెంలో బియ్యం పోసి దాని మీద తమలపాకు రెండు పెట్టి పసుపుతో గౌరీ దేవిని చేసి పెట్టి, వస్త్రం, జంధ్యం,రెండు వక్కలు, ఒకటి నాణెము పెట్టి ఆ పీట మీద రెండు దీపపు కుందులు పెట్టి గౌరీ దేవికి పండ్లు ,పువ్వులు ,తాంబూలం ఇలా అన్ని సమకూర్చిన తరువాత బియ్యం పిండితో కుడుములు చేసి తరువాత దారంతో 16 పోగులు చేసి 16 ముడులు వేసి 16 ఉత్తరేణి ఆకులు కంకణంలా కట్టవలెను. ఇలా 16 పోగుల దారంతో రెండు కంకణాలుగా తయారు చేసుకోవాలి. ఐదు పోగుల దారం రెండు తయారు చేసుకోవాలి. ఐదు పోగు

జంధ్యాల పూర్ణిమ jandyala purnima | sravana purnima

Image
 జంధ్యాల పూర్ణిమ, దీనినే  శ్రావణ పూర్ణిమ అని  కూడా అంటారు. శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతం ధారణ చేస్తారు. యజ్ఞోపవీతం లోని గ్రంధిని బ్రహ్మ ముడి అంటారు. ఈ ముడి చివరన, గాయత్రీ ఉంటుంది. జంధ్యము, బ్రహ్మ తేజస్సు,  వర్చస్సు, ఆయుష్షు, యశస్సు అనుగ్రహిస్తుంది. శ్రావణ పూర్ణిమ రోజున అశౌచ సందర్భాలలో నూతన యజ్ఞోపవీతం ధరించాలి. జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని ఎక్కువ కాలం ధరించరాదు. కొత్త జంధ్యం వేసుకున్న తరువాత పాత జంద్యముతో కలిసి పట్టుకొని  గాయత్రీ మంత్రాన్ని  జపించాలి.   తత్ద్వారా నూతన యజ్ఞోపవీతం శక్తి వంతం అవుతుంది.   ఆ తరువాత పాత యజ్ఞోపవీతం ఎవరు తొక్కని  చోట కానీ, పారేనీటిలో కానీ వేయాలి. శ్రావణ పూర్ణిమ నాడు జంధ్యం మార్చుకొని, యధా శక్తి  గాయత్రీ మంత్రం జపించాలి.

బలహీన లక్షణం

Image
దేవుడా నీవే దిక్కు అంటూ  చెతికిల పడటం  బలహీన లక్షణం.  తనపై తనకు నమ్మకం , పట్టుదల, విశ్వాసం కలిగిన వ్యక్తి దేనినైనా సాధించవచ్చు    

edi raadu venta

Image
భార్య , భర్త , కొడుకు , కోడండ్లు, అల్లుళ్లు , బిడ్డలు , తల్లి తండ్రి , అక్కలు ,చెల్లెలు ,అన్నలు ,తమ్ములు ,మనవళ్ళు  ,బంధువులు తనువు వెళ్ళేటప్పుడు ఎవరు రారు వెంట. మిద్దెలు ,మేడలు, ఆస్తులు, అంతస్తులు ,ఏవి రావు వెంట  దానధర్మాలు ,మంచి చెడులు ,మాత్రమే వెంటవచ్చును   

ఏది శాశ్వతం

Image
చంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటి ఏదిరా  కళ్ళు మూసి తెరిచే లోపల కలిమిలేములు మారురా  మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా  నాది నీది  యనుచు నరుడా వాదులాడబోకురా  బంక మట్టి ఇల్లురా ఇది భగ్గి భుగ్గి అవునురా  ఆలుపిల్లలు ఆస్తి పాస్తులు అంతం ఏమవునురా  తత్వ మర్మము తెలియలేకను తప్పుదారిన బోకురా  ఆత్మకెప్పుడు చావులేకను అంతటా వెలుగొందురా  మట్టి మట్టి కలిసినాక ఎట్టిభేదాలుండురా  --------- సేకరణ : పూర్ణోదయం   

telugu quotes

Image

telugu quotes

Image