Posts

Showing posts from October, 2021

nagna satyam quotes #purnodayam.blogspot.com

Image
నగ్న సత్యం   దానం చేసే గుణం ఉన్న వారికి  ధనం ఉండదు  ధనం ఉన్నవారికి  దానం చేసే గుణం ఉండదు  ఎదుటివారిని బాధపెట్టేవారికి ఆనందం ఉంటుంది  ఎదుటివారిని ప్రేమిస్తున్నట్లు నటించేవారికి ప్రేమ గుణం ఉండదు  నిజంగా ప్రేమించేవాడికి కన్నీరు ఉంటుంది  ఎదుటివారిని నవ్విస్తూ ఉండేవారికి బాధలు ఉంటాయి  ఇది నగ్న సత్యం Telugu quotes Nagna Satyam Purnodayam.blogspot.com

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

Image
కుంకుమ గౌరీ నోము కథ  ఒక బ్రాహ్మణునకు లేకలేక ఒక కూతురు కలిగెను.అతడు ఆమె జాతకము చూడగా , అందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్లి పార్వతి దేవిని ప్రార్ధించెను. అంతటా దయామయియగు పార్వతీదేవి ప్రత్యక్షమై, మీకేమి కావలెను ? అని అడుగగా, అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండు అట్లు చేయమని ప్రార్ధించెను. అప్పుడు పార్వతీదేవి, ఓయి బ్రాహ్మణోత్తమా ! నీ కుమార్తె పూర్వ జన్మమున కుంకుమ గౌరీ నోము నోచి ఉల్లంగించుటచే ఈ జన్మలో బాల వైధవ్యం ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము చేయించునచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా , అమ్మకు భక్తితో నమస్కరించి కూతురితో ఆ నోము చేయించి తరువాత ఆమెకు వివాహం చేసెను.  ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉన్నది.  ఈ నోము ఒక సంవత్సరం పాటు కార్తీకం లేదా మాఘమాసంలో మొదలుపెట్టి రోజు ఉదయం దీపారాధన చేయగానే , అక్షింతలు చేత పట్టుకొని ఈ  కథ చదువుకొని , కథ చదువుకోవడం పూర్తి కాగానే కొన్ని అక్షింతలను గౌరీ దేవి పటమునకు వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకునే వారి తలపై వేసుకోవలెను. ఇలా సంవత్సరంపాటు చేసిన తరువాత ఉద్యాప

లక్ష్మికళ || purnodayam blogspot || telugu quotes

Image
లక్ష్మికళ  ఆధునిక  అవసరాలకు తగినట్లుగా , అటు తండ్రికో ఇటు భర్తకో ఆర్ధిక సహకారాన్ని అందించగలిగిన ప్రతిమహిళా మహాలక్ష్మి స్వరూపమే . సంపాదించకపోయిన ఉనంతలో పొదుపుగా ఇల్లు దిద్దుకుంటే చాలు ఇక ఆ ఇల్లు లక్ష్మీకళ తో శోభిల్లుతుంది  ఉనంతలో తృప్తిగా ఉంటే నిజంగా ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. 

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure

Image
దంపతి తాంబూల నోము కథ . ఒక రాజు భార్య దంపతుల తాంబూలము నోము పట్టి నియమం తప్పింది. అందువలన ఆ భార్య భర్తలు దూరం అయ్యారు , సంపదలు తగ్గాయి . అందువలన ఆమె అరణ్యమునకు వెళ్లి అచట పార్వతి పరమేశ్వరుల గూర్చి తపస్సు చేయగా , పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి , నీవు దంపతుల తాంబూల నోము పట్టి నియమం తప్పినావు  , అందువలన నీకు ఈ బాధ కలిగింది. కావున నీవు ఇంటికి వెళ్లి నియమం తప్పకుండ ఈ వ్రతం చేసుకొని ఉద్యాపన చేసుకొనిన ఎడల నీ పూర్వపు భాగ్యాలు నీకు కలుగుతాయి. నీ భర్త నీకు దగ్గర అవుతాడు అని చెప్పారు. అప్పుడు రాజు భార్య ఇంటికి వచ్చి, భక్తి శ్రద్దలతో నోము చేసుకొని ఉద్యాపన చేసినది. అప్పుడు ఆమె భర్త తిరిగి వచ్చాడు. పూర్వపు భాగ్యాలు తిరిగి వచ్చాయి. భార్య భర్తలు   ఆనందంగా ఉన్నారు ఉద్యాపన : ఒక సంవత్సరము పాటు , రోజు ఉదయం మన పూజ గదిలో దీపం పెట్టగానే అక్షింతలు చేతపట్టుకొని. పైన రాసిన కథ చదువుకొని, తరువాత అక్షింతలను కొన్ని పార్వతి పరమేశ్వరుల పటమును వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకొనే స్త్రీ తలపై చల్లుకొనాలి. ఇలా సంవత్సరం తరువాత బ్రాహ్మణా దంపతులకు భోజనం పెట్టి, 360 తమలపాకులు, 360 పోకచెక్కలు , ఇద్దరికి వ

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

Image
ఈర్షా ద్వేషాలు  పుట్టిననాడు ఏమి తీసుకురాలేదు  పోయేటప్పుడు ఏది వెంటరాదు  మధ్యలో ఈ నాలుగురోజుల జీవితానికి మనుషులు  ఒకరిమీద ఒకరికి పగలు ప్రతీకారాలు ఈర్షా  ద్వేషాలు ఎందుకు ? అంత ఒకటే అనుకున్ననాడు అంతకుమించిన ఆనందం అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు.

అనుభవాలు, purnodayam blogspot

Image
అనుభవాలు శిశిరం తరువాత వచ్చే వసంతంల,  చీకటి వెనుక వెలుగుల  మనిషి జీవితం లోను సుఖనుభవాలు, దుఃఖనుభవాలు  ఒకదాన్ని వెంట మరి ఒకటి కలుగుతాయి.